Site icon NTV Telugu

Beast : ఫ్లాప్ అయినా పార్టీ ఇచ్చిన విజయ్

Beast

Beast

తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ఆయన కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆయన అభిమానులను సైతం నిరాశపరిచిన ఈ సినిమా ‘కెజిఎఫ్‌2’ దెబ్బకి అడ్రెస్ లేకుండా పోయింది. ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’ సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ కి ముందు పాటలు హిట్ కావటంతో పుల్ హైప్ క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత తుస్సుమనిపించింది. రిలీజ్ తర్వాత సినిమా ప్లాఫ్ కి దర్శకుడు కారణమని విజయ్ తండ్రి యస్.ఎ. చంద్రశేఖర్ కామెంట్ చేసినట్లు సోషల్ మీడియా కోడై కూసింది. కానీ సినిమా నిరాశ పరిచినా హీరో విజయ్ ఇటీవల తన ఇంట్లో ‘బీస్ట్’ నటీనటులు ఇతన సిబ్బందికి పార్టీ ఏర్పాటు చేయటం విశేషం. ఈ విందులో చిత్ర దర్శకుడు నెల్సన దిలీప్ కుమార్ తో పాటు, హీరోయిన్ పూజా హెగ్డే, సహాయ నటులు సతీష్, వీటీవీ గణేష్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా హాజరయ్యారు.

Exit mobile version