టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న సంగతి తెల్సిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రమ్స్లో నటించిన ఈ జంట అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే వీడీ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ లోను రష్మిక కనిపించడం .. వీరిద్దరూ నైట్ పార్టీలకు వెళ్తూ కెమెరా కంటికి చిక్కడంతో వీరిద్దరి ఆమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లితో ఒకటి కానున్నారని పుకార్లు పుట్టుకొచ్చేశాయి. ఇక ఇటీవలే రష్మిక కూడా మా మధ్య స్నేహ బంధం తప్ప ఏమిలేదని తేల్చిచెప్పేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజగా విజయ్ కూడా ఈ వార్తలను తీవ్రంగా ఖండించాడు. ఒక వెబ్ సైట్.. రష్మిక- విజయ్ పెళ్లి అంటూ రాసుకురావడంతో విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో మీడియాకు చురకలు అంటించారు. అంతా నాన్సెన్స్ అని కొట్టిపారేస్తూ.. కొద్దిగా ఘాటుగానే మాట్లాడాడు ”ఎప్పటిలానే నాన్సెన్స్. డోంట్ వీ జస్ట్.. ‘లవ్’ డా న్యూస్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదేందయ్యా ఇది ఎంత మాత్రం ఫేక్ న్యూస్ అయితే మాత్రం మరి ఇలా బూతులు మాట్లాడొచ్చా..? అని కొందరు అంటుండగా.. మరికొందరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడిన తప్పులేదు.. ఇలా ఫేక్ న్యూస్ వలన వారు ఎంత ఇబ్బంది పడతారో తెలియదా..? అని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్, పూరి దర్శకత్వంలో లీగర్ లో నటిస్తున్నాడు.
