NTV Telugu Site icon

Family Star: పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా అంటున్న దేవరకొండ

Family Star Glimpse

Family Star Glimpse

Vijay Deverakonda VD13 titled as “Family Star” Glimpse Released: స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు “ఫ్యామిలీ స్టార్” టైటిల్ ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ఎస్వీసీ సంస్థలో నిర్మితమవుతున్న 54వ సినిమా. ఫ్యామిలీ స్టార్ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయగా ఆ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ ఫ్యామిలీ స్టార్ టీజర్ లో ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్ గా, బయట రౌడీల బెండు తీసే పవర్ ఫుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు.

Japan: ‘జపాన్’ దిగుతున్నాడు.. ‘పెద్దమ్మ’ను దింపుతున్నాడు

లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్ కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కు పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే అని విలన్ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే భలే మాట్లాడతారన్నా మీరంతా, ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా, పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? ఐరెన్ వంచాలా ఏంటి అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిన విజయ్ విలన్ గ్యాంగ్ లోని ఒకడి తల పగలగొట్టి సారీ బాబాయ్ కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయా తలకాయ కొట్టేశా అని విలన్ కు షాక్ ఇవ్వడం షాక్ ఇస్తోంది. ఇక టీజర్ చివరలో బ్యూటిఫుల్ యంగ్ కపుల్ గా విజయ్, మృణాల్ మధ్య ఎమోషనల్ బాండింగ్ రివీల్ చేయడం చూస్తుంటే ఫ్యామిలీ స్టార్ ఒక కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించబోతున్నట్లు అర్ధం అవుతోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోన్నట్టు అధికారికంగా ప్రకటించగా త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.