Site icon NTV Telugu

Vijay Deverakonda: మాట నిలబెట్టుకుంటూ… 100 కుటుంబాలకి 100000 ఇచ్చాడు

Vijay Deverakonda

Vijay Deverakonda

“ఖుషి” సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకోవాలని ఉందని, ఇందుకు 100 ఫ్యామిలీస్ ను ఎంపికచేసి వారికి లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు అందిస్తామని హీరో విజయ్ దేవరకొండ ఖుషి వైజాగ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో అనౌన్స్ చేశారు. ఆ రోజు వేదిక మీద చెప్పినట్లే..ఇవాళ 100 మంది లక్కీ ఫ్యామిలీస్ ను ఎంపికచేసి ఆ లిస్టును రిలీజ్ చేశారు విజయ్. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు లోని ప్రాంతాల నుంచి కూడా విజేతలను ఎంపిక చేయడం విశేషం. త్వరలోనే వీరికి హైదరాబాద్ లో జరిగే ఖుషి గ్రాండ్ ఈవెంట్ లో చెక్స్ పంపిణీ చేయబోతున్నారు.

Read Also: Jr NTR: సైమా స్టేజ్ పైన కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్…

హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ – ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసుకునేందుకు ఈ వంద మంది ఫ్యామిలీస్ ను ఎంపిక చేశాం. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నా. అంటూ పేర్కొన్నారు. ఖుషి సినిమాను విజయ్ దేవరకొండ, సమంత జంటగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ నెల 1న రిలీజై సూపర్ హిట్ అందుకుంది.

Exit mobile version