NTV Telugu Site icon

Vijay Devarakonda: సమంత ముఖంపై నవ్వు చూడాలని ఉంది

Vijay

Vijay

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మీ అందరికి ఖుషీ ఇవ్వడానికే మా ప్రయత్నం అని తెలిపాడు. సెప్టెంబర్ 1 న ఆ ప్రేక్షకులు థియేటర్ నుంచి నవ్వుతు వస్తారని, ఇలా నవ్వుతు ప్రేక్షకులు బయటికి వచ్చే సినిమా అంతకుముందు ఎప్పుడు ఇచ్చానో గుర్తులేదని విజయ్ అన్నాడు. ఇక సమంత గురించి విజయ్ మాట్లాడుతూ.. ” సమంత.. ఈ సినిమాకు మెయిన్. ఆమె లేకపోతే సినిమా లేదు. మొదట నుంచి సినిమా షూటింగ్ అయ్యేవరకు అంతా సజావుగా జరుగుతుంది అనుకొనేలోపు సామ్ హెల్త్ బాలేదు. జూలై నెలలో షూటింగ్ ను ఆపేశాం. చూడడానికి ఇంత అందంగా ఉంది.. స్క్రీన్ పై ఎంత అందంగా కనిపిస్తుంది. అలాంటి అమ్మాయికి హెల్త్ బాలేదేంటి అంటుంది అని అనుకున్నాం. కానీ, సడెన్ గా ఒకరోజు న్యూస్ తెలిసింది. మూడు రోజుల్లో వస్తుంది అనుకున్నాం.. ఆతరువాత రెండు వారాల్లో సెట్ అవుతుంది అనుకున్నాం.. కానీ, అది ఎంత సీరియస్ అనేది సమంత చెప్పిన తరువాతనే తెల్సింది. ఆ తరువాత నుంచి మాతో సామ్ కాంటాక్ట్ లో లేదు. ఇక కొద్దిగా సెట్ అయ్యాక ఆమె షూటింగ్ లో పాల్గొంది. ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తిచేసింది.

Samantha : మీకోసమే హార్డ్ వర్క్ చేస్తున్నా.. గట్టి బ్లాక్ బస్టర్ ఇస్తాను

ఇక ఈ మధ్య ప్రమోషన్స్ లో ఆమెను కలిసిన 50- 60 మందిలో 40 మంది.. సామ్ ను ఒక ఇన్స్పిరేషన్ లా చూస్తున్నారు.తాము పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నామని చెప్పుకొస్తున్నారు. వారిని చూసాక సామ్ తన వ్యాధి గురించి బయటకు చెప్పి మంచి పని చేసింది. ఈ సినిమా ద్వారా సమంత ముఖంపై నవ్వు చూడాలని ఉంది. ఇక శివ నిర్వాణ.. నన్ను నమ్మినందుకు థాంక్స్. ఆయన నా ఫ్యాన్ .. ఆ అభిమానాన్ని మొత్తం సినిమాలో చూపించాడు. సినిమా మొదలైన దగ్గరనుంచి.. పూర్తయ్యేవరకు ముఖంలో చిరునవ్వు పోలేదు. అంతలా కథను నమ్మాడు. ఇక చిత్ర బృందం మొత్తం ఎంతో కష్టపడి పనిచేసింది. ఇక నా అభిమానులు.. ఆరేడేళ్లు అవుతుంది నేను వచ్చి.. అప్పటినుంచి నా సక్సెస్,ఫెయిల్యూర్ లో ఇంత ప్రేమ ఇచ్చారు. చాలా మారాయి లైఫ్ లో .. ఎత్తు పల్లాలు చూస్తున్నా.. నా చుట్టూ మనుషులు మారినా.. మీరు మాత్రం మారడం లేదు. నా గురించి ఏదో మాట్లాడతారు కానీ, నాపై అంతే ప్రేమ చూపిస్తున్నారు. మీ అందరి ముఖాల్లో నవ్వు చూడడమే నా కోరిక” అంటూ చెప్పుకొచ్చాడు.

Show comments