Kushi: రౌడీ ర్యాంపేజ్… ఫస్ట్ డే దుమ్ములేపాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 1న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఖుషి మూవీ… మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమలాపురం టు అమెరికా వరకు… ఖుషి మూవీ ఫ్యామిలీతో కలిసి చూసే పర్ఫెక్ట్ సినిమా అనే రివ్యూస్ అందుకుంది. శివ నిర్వాణ మార్క్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. వరల్డ్ వైడ్‌గా 52 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది ఖుషి. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ పైనే అందరి దృష్టి ఉంది. అంచనాలకు తగ్గట్టే ఖుషి సినిమాకు ఊహించని వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర డే వన్ 400K ప్లస్ డాలర్స్ గ్రాస్ రాబట్టి.. అక్కడ 2023లో టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు పైగా షేర్… ప్రపంచవ్యాప్తంగా 14 నుంచి 16 కోట్ల వరకు షేర్ అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గ్రాస్ లెక్కల ప్రకారం వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. లైగర్ తో డిజాస్టర్ ఇచ్చినా కూడా ఖుషి 30 కోట్ల ఓపెనింగ్ తెచ్చుకుంది అంటే ఇది రౌడీ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. ఈ మూవీతో విజయ్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చేసినట్టే. దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. చివరగా లైగర్ సినిమాతో దారుణమైన రిజల్ట్ అందుకున్నాడు కానీ ఖుషి సినిమాతో డీసెంట్ హిట్ కొట్టేసి… అదిరిపోయేలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండతో పాటు… సమంత, శివ నిర్వాణ కూడా ఖుషి సినిమాపై భారీ ఆశలు పెట్టున్నారు. ఎందుకంటే… వీళ్ల చివరి సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో ఖుషి రిజల్ట్ వీళ్లకు ఎంతో కీలకంగా మారింది. ఫైనల్‌గా ఈ ముగ్గురిని ఖుషి మూవీ ఫుల్ ఖుషీ చేసింది. అలాగే ఈ సినిమాతో మళయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ తెలుగులో జెండా పాతేశాడు.
Also Read
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
- 'Raaka' Glimpse: 'రాకా' ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
- Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!