Site icon NTV Telugu

Kushi: రౌడీ ర్యాంపేజ్… ఫస్ట్​ డే దుమ్ములేపాడు!

Kushi Censor Review

Kushi Censor Review

సెప్టెంబర్ 1న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఖుషి మూవీ… మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమలాపురం టు అమెరికా వరకు… ఖుషి మూవీ ఫ్యామిలీతో కలిసి చూసే పర్ఫెక్ట్ సినిమా అనే రివ్యూస్ అందుకుంది. శివ నిర్వాణ మార్క్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. వరల్డ్ వైడ్​గా 52 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది ఖుషి. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ పైనే అందరి దృష్టి ఉంది. అంచనాలకు తగ్గట్టే ఖుషి సినిమాకు ఊహించని వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. యూఎస్‌ బాక్సాఫీస్ దగ్గర డే వన్ 400K ప్లస్ డాలర్స్‌ గ్రాస్ రాబట్టి.. అక్కడ 2023లో టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు పైగా షేర్… ప్రపంచవ్యాప్తంగా 14 నుంచి 16 కోట్ల వరకు షేర్ అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గ్రాస్ లెక్కల ప్రకారం వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. లైగర్ తో డిజాస్టర్ ఇచ్చినా కూడా ఖుషి 30 కోట్ల ఓపెనింగ్ తెచ్చుకుంది అంటే ఇది రౌడీ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. ఈ మూవీతో విజయ్‌ సాలిడ్ కమ్‌ బ్యాక్ ఇచ్చేసినట్టే. దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. చివరగా లైగర్ సినిమాతో దారుణమైన రిజల్ట్‌ అందుకున్నాడు కానీ ఖుషి సినిమాతో డీసెంట్ హిట్ కొట్టేసి… అదిరిపోయేలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండతో పాటు… సమంత, శివ నిర్వాణ కూడా ఖుషి సినిమాపై భారీ ఆశలు పెట్టున్నారు. ఎందుకంటే… వీళ్ల చివరి సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో ఖుషి రిజల్ట్ వీళ్లకు ఎంతో కీలకంగా మారింది. ఫైనల్‌గా ఈ ముగ్గురిని ఖుషి మూవీ ఫుల్ ఖుషీ చేసింది. అలాగే ఈ సినిమాతో మళయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ తెలుగులో జెండా పాతేశాడు.

Exit mobile version