Site icon NTV Telugu

Vijay Deverakonda: కాలు మీద కాలేసుకొని చెబుతా

Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Deverakonda Responds To Movie Journalist: ‘లైగర్’ ప్రెస్ మీట్‌లో ఓ విలేఖరి విజయ్ దేవరకొండను ‘ఇంతకు ముందులాగా, మిమ్మల్ని ఫ్రీగా ప్రశ్నలు అడగలేకపోతున్నాం’ అని అన్నారు. దానికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ, ‘మీరు ఫ్రీగా అడగలేకపోతుండ్రా.. కాలుమీద కాలేసుకొని అడగండి.. నేను కూడా అలాగే కాళ్ళు పైన పెట్టుకొని చెబుతా..’ అంటూ సందడి చేశాడు. అదే విలేఖరి ‘పెళ్ళిచూపులు’ సమయంలో విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేస్తూ, ‘మీకు బాలీవుడ్ వెళ్ళే ఉద్దేశం ఉందా?’ అని ప్రశ్నించారట.

అందుకు విజయ్ ‘ఇప్పట్లో ఆ ఆలోచన లేదు’అని సమాధానమిచ్చాడట. కానీ, ఇప్పుడు ‘లైగర్’తో బాలీవుడ్‌లోనూ విజయ్ ఎంట్రీ ఇవ్వడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని సదరు మీడియా పర్సన్ చెప్పారు. అందుకు విజయ్ దేవరకొండ తనదైన పంథాలో ఆ విలేఖరికి వందనం చేశాడు. “ఇక ఎప్పుడూ మీ పేరు మరచిపోలేను” అనీ సదరు విలేఖరితో విజయ్ చెప్పడం ప్రెస్ మీట్‌లో నవ్వులు పూయించింది.

Exit mobile version