Site icon NTV Telugu

Kushi: గట్టిగా నమ్ముతున్నా, దాని కోసం వెయిటింగ్.. రిలీజ్ కి గంటల ముందు విజయ్ వీడియో వైరల్

Kushi Censor Review

Kushi Censor Review

Vijay Deverakonda Releases a Video Before Kushi Release: టాలివుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అయిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాల మీద సూపర్ బజ్ ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈరోజు వరకు హీరో విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సరిగ్గా సినిమా రిలీజ్ కి కొద్ది గంటలు మాత్రమే ఉందనగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశాడు.

Anushka Shetty: టార్గెట్ అనుష్క శెట్టి.. పాపం రాక తప్పట్లేదుగా!

ఆ వీడియోలో విజయ్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం, ఖుషీ రేపు రిలీజ్ అవుతుంది. ఇంత తొందరగా రిలీజ్ దగ్గరికి ఎలా వచ్చామో నాకు గుర్తు కూడా లేదు, సడన్లీ ఈరోజు రాత్రి అమెరికా ప్రీమియర్లు, రేపు ఇండియాలో మీరు అందరూ చూస్తారు. కానీ మీరందరూ నవ్వుతూ మీ ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో థియేటర్ బయటకు వస్తారని గట్టిగా నమ్ముతున్నా.. ఈ విజువల్ గురించి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇక ఇప్పుడు ఆనందంగా ఉన్న మన తెలుగు సినిమా ప్రేక్షకులను చూసేందుకు నాకు ఏమాత్రం ఆగాలని లేదు అని అంటూ ఆయన స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఒక వీడియోను షేర్ చేశాడు .

Exit mobile version