Site icon NTV Telugu

Vijay Deverakonda: “రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్” క్లాత్ బ్రాండ్ ను రీ లాంచ్ చేస్తున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda On Movie Production

Vijay Deverakonda On Movie Production

Vijay Deverakonda relaunching RWDY Indian street culture in December : స్టార్ హీరోగా సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తూ పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల అభిమానం పొందుతున్న విజయ్ దేవరకొండ ఈమధ్యనే ఖుషీ సినిమాతో హిట్ కొట్టాడు. సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక ఇలా ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క బిజినెస్ కూడా మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ ఒక పక్క సినిమా స్టార్ గా కొనసాగుతూనే ఫ్యాషన్ పట్ల తనకున్న ఇష్టాన్ని తన సొంత రౌడీ క్లాత్ బ్రాండింగ్ ద్వారా చూపిస్తున్నారు. రౌడీ క్లాత్ బ్రాండింగ్ ఇప్పటికే యూత్ లో బాగా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తన ఫ్యాన్స్ ను రౌడీస్ అంటూ విజయ్ ప్రేమగా పలకరిస్తుంటారు కూడా. తన క్లాతింగ్ బ్రాండ్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకున్న విజయ్ దేవరకొండ రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్ పేరుతో రీ లాంఛ్ చేస్తున్నారు.

Shivani Rajasekhar: ఉప్పెనలో కృతి శెట్టి రోల్ నాదే.. కానీ అందుకే వదిలేశా!

డిసెంబర్ లో రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్ రీ లాంఛ్ కాబోతోందని అధికారికంగా ప్రకటించారు. ఫ్యాషన్ రంగంలో ఇండియన్ ఆధిపత్యాన్ని రౌడీ క్లాత్ బ్రాండింగ్ ముందుకు తీసుకెళ్తుందని కూడా తాజాగా ఒక ప్రకటనలో గర్వంగా ప్రకటించారు విజయ్ దేవరకొండ. ఈ క్లాతింగ్ బ్రాండ్ రేట్స్, వివరాలు ప్రస్తుతానికి ప్రకటించలేదు కానీ ఎర్లీ యాక్సెస్ చేసుకోవాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ కోసం లింక్ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version