Site icon NTV Telugu

Vijay – Rashmika: డార్లింగ్ అంటూ విజయ్ ట్వీట్ – రష్మిక రిప్లై చూశారా?

Vijay Rashmika

Vijay Rashmika

Vijay Deverakonda – Rashmika Tweets viral on Social Media: హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీకి సైతం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చినా వీరు స్నేహితులం అని చెప్పుకుంటూనే ఉంటారు. ఇక తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ ను ఉద్దేశిస్తూ ‘నువ్వు ఎప్పటికీ ది బెస్ట్’ అని ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

Meenakshi Chaudhary: గ్రీన్ డ్రెస్సులో మీనాక్షి సొగసు జాతర… కళ్ళు తిప్పుకోని అందమిదే!

రణబీర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం ఉదయం టీజర్ ను చిత్రబృందం విడుదల చేయగా టీజర్ ని ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ‘యానిమల్’ టీజర్ తనకు ఎంతో నచ్చిందని మై డార్లింగ్స్ సందీప్ రెడ్డి వంగ, రష్మిక అలాగే నాకెంతో ఇష్టమైన నటుడు రణబీర్ కపూర్ కు ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్ డే” అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై తాజాగా రష్మిక స్పందించి థాంక్యూ విజయ్ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్” అని రిప్లై ఇచ్చింది. దీంతో వీళ్ళ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన యానిమల్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version