Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photo Going Viral: ‘మీరిద్దరు ప్రేమలో ఉన్నారా’ అనే ప్రశ్న ఎదురైనప్పుడల్లా.. ‘మేమిద్దరం మంచి స్నేహితులం, అంతకుమించి మా మధ్య ఏమీ లేదు’ అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణ సమాధానం ఇస్తూ వస్తున్నారు. అయినా సరే.. వీరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే ప్రచారాలు మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు. మరీ ముఖ్యంగా.. ఇటీవల వీళ్లు మాల్దీవులకి వెళ్లొచ్చినప్పటి నుంచి ఆ రూమర్లు మరింత పెరిగాయి. ప్రేమలో ఉన్నారు కాబట్టే, జంటగా మాల్దీవులకు వెళ్లారంటూ కథనాలు వస్తున్నాయి. అటు.. అభిమానులకు కూడా వీళ్ల జోడీ అంటే చాలా ఇష్టం. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు, ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీరి జంట చూడముచ్చటగా ఉంటుంది. అందుకే, వీళ్లు తమ డేటింగ్ వార్తల్ని ఎప్పుడెప్పుడు కన్ఫమ్ చేస్తారా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని తెగ ఆరాట పడుతున్నారు.
ఇలాంటి తరుణంలో.. విజయ్, రష్మిక పూలదండలు మార్చుకున్న వెడ్డింగ్ ఫోటో ఒకటి తెరమీదకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోలో రష్మిక బ్లష్ అవుతుండగా, విజయ్ ఆమెని పట్టుకొని కెమెరాకి పోజిస్తున్నట్టు గమనించవచ్చు. అది చూసిన కొందరు.. వీళ్లకు పెళ్లైపోయిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, బహుశా ఇది కొత్త ఫోటోషూట్ అయ్యుండొచ్చని ఇంకొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ రెండూ నిజం కావు. ఎందుకంటే.. ఇది నిజమైన ఫోటో కాదు. క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఇదొక మార్ఫ్డ్ ఫోటో అని సులువుగా పసిగట్టొచ్చు. విజయ్, రష్మిక పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న అభిమానులు.. వాళ్లు పెళ్లి చేసుకునేలోపు వెయిట్ చేయలేక, ఇలా ఫోటోని ఎడిట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఉన్న దృశ్యం, నిజ జీవితంలోనూ జరగాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.