Vijay Deverakonda Puri Jagannadh Join Hands Third Time For Socio Fantasy: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ఇప్పటికే రెండు ప్రాజెక్టుల కోసం జోడీ కట్టారు. ఒకటి ‘లైగర్’ రిలీజ్‌కి ముస్తాబవుతుండగా, రెండోది ‘జన గణ మన’ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, వీళ్లిద్దరు తమ కాంబోలో ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ కూడా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ‘జన గణ మన’ విడుదలకి ముందు ఈ మూడో సినిమాని అనౌన్స్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలిసింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇది ఏ జోనర్‌లో రూపొందనుందన్న విషయం బయటకు పొక్కింది.
ఇండస్ట్రీ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం.. సోషియో-ఫ్యాంటసీ జోనర్‌లో ఈ సినిమాని తెరకెక్కించాలని పూరీ ఫిక్స్ అయ్యాడని, బేసిక్ ప్లాట్ కూడా లాక్ చేశాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, పూరీ తొలిసారి ఓ సోషియో-ఫ్యాంటసీ స్క్రిప్ట్ చేయబోతున్నాడన్నమాట! జగదేక వీరుడు అతిలోక సుందరి, యమదొంగ సినిమాల తరహాలో ఈ చిత్రం ఉండనున్నట్టు టాక్ వినిపిస్తోంది. తనపై వస్తోన్న రొటీన్ సినిమాల దర్శకుడు అనే మార్క్‌ని తుడిచేయడం కోసమే పూరీ ఈ ప్రయత్నానికి ఒడిగట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని, పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేయనున్నారని సమాచారం. కమర్షియల్ ఎలిమెంట్స్‌కి ఏమాత్రం ఢోకా లేకుండా, ఈ సినిమాని గ్రాండ్‌గా రూపొందించేలా పూరీ పక్కా ప్రణాళికలు రచించుకున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా.. పూరీ-విజయ్ కాంబోలో రూపొందిన ‘లైగర్’ సినిమా ఆగస్టు 25వ తేదీన భారీఎత్తున రిలీజ్ అవుతోంది. వీరిది క్రేజీ కాంబో కావడం, కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా రూపొందడం, ప్రోమోలు సైతం ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో.. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అటు, జగ గణ మన సినిమాను వీలైనంత త్వరగా ముగించి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
