Site icon NTV Telugu

Kingdom : కింగ్ డమ్ కోసం విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్..

Kingdom

Kingdom

Kingdom : విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. భాగ్య శ్రీ బోర్సే గ్లామర్ ప్లాస్ పాయింట్. ఇందులో యాక్షన్, ఎమోషన్ హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ, మిగతా టీమ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మూవీ బడ్జెట్ రూ.130 కోట్లు. దీని కోసం విజయ్ దేవరకొండ రూ.30 కోట్ల వరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ తర్వాత డైరెక్టర్ గౌతమ్ దీని కోసం రూ.10 కోట్లు తీసుకున్నాడు.

Read Also : Kingdom : ఈ స్థాయికి వస్తా అనుకోలేదు.. విజయ్ ఎమోషనల్

అనిరుధ్ రూ.7కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇందులో విజయ్ అన్న పాత్ర చేసిన సత్యదేవ్ కు రూ.3 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారు. భాగ్య శ్రీ రూ.కోటి వరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ గత సినిమాల కంటే ఈ మూవీకే ఎక్కువ తీసుకున్నాడు. ఈ మూవీ కోసం ఏడాదిన్నర నుంచి కష్టపడుతున్నాడు. ఈ మూవీతో ఎలాగైనా భారీ హిట్ కొట్టి మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ మీద మంచి నమ్మకం ఉండటంతో పాటు.. స్క్రిప్ట్ కూడా డిఫరెంట్ గా ఉండటం వల్ల మూవీపై హైప్ ఏర్పడింది. మరి జులై 31న ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో వేచి చూడాలి.

Read Also : Puri-Sethupathi : చిరుతో తీయాల్సిన మూవీ సేతుపతితో చేస్తున్న పూరీ.. క్లారిటీ

Exit mobile version