ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్న మంచి ప్రామిసింగ్ నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ హాటెస్ట్ హంక్ కు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తరచుగా సోషల్ మీడియాలో ఈ హీరో తన వీడియోలతో తన అభిమానులను ట్రీట్ చేస్తాడు. అలాగే విజయ్ తాజాగా షేర్ చేసిన కొత్త పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫార్మల్ డ్రెస్ లో రౌడీ హీరో సో హ్యాండ్సమ్ అనేలా ఉన్నాడు.
Read Also : Will Smith : ఆస్కార్ ఉత్తమ నటుడు విల్ స్మిత్ కు ఏం జరగనుంది?
ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అనన్య పాండేతో కలిసి “లైగర్” అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ ఆగష్టు 25న రిలీజ్ కానుంది. కాగా నెక్స్ట్ మూవీని కూడా పూరీ దర్శకత్వంలోనే చేయబోతున్నాడు విజయ్. పూరీ డ్రీం ప్రాజెక్ట్ ‘జన గణ మన’ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 3 ఆగస్టు 2023న థియేటర్లలోకి రానుంది. “జన గణ మన” చిత్రాన్ని ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ నిర్మించనున్నారు, దీనికి స్క్రీన్ ప్లే, డైలాగ్, దర్శకత్వం పూరి జగన్నాధ్ అందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పాన్-ఇండియా చిత్రంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.
Boy. pic.twitter.com/xCAYZb88Sb
— Vijay Deverakonda (@TheDeverakonda) March 30, 2022