Site icon NTV Telugu

Kingdom : కింగ్ డమ్ వాయిదా తప్పదా..?

Kingdom

Kingdom

Kingdom : విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ మళ్లీ వాయిదా పడేలా ఉంది. ఆల్రెడీ మే 30న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించినా.. చివరకు జులై 4కు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ వాయిదా వేస్తారని తెలుస్తోంది కింగ్ డమ్ కంటే ముందే నితిన్ నటించిన తమ్ముడు మూవీ జులై 4న రిలీజ్ డేట్ ప్రకటించింది. తమ్ముడు మూవీ ఉన్నా సరే రిలీజ్ కు ముందు డేర్ చేసింది. కానీ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు జూన్ 12 నుంచి తప్పుకుంది. చూస్తుంటే వీరమల్లు జులై మొదటి వారంలోనే రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు సమాచారం.

Read Also : Balakrishna : తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు హంగామా..

వీరమల్లు జులై మొదటి వారంలోనే వస్తే తమ కింగ్ డమ్ మూవీని వాయిదా వేసుకుంటామని ఇప్పటికే నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. నిన్న అమేజాన్ తో ముంబైలో వీరమల్లు టీమ్ చర్చలు జరిపింది. ఆల్రెడీ అమేజాన్ వాళ్లు అడ్వాన్స్ ఇవ్వడంతో.. ఇప్పుడు త్వరగా రిలీజ్ చేయాలని ఒత్తిడి పెడుతున్నారంట. వీటన్నింటి నేపథ్యంలో వీరమల్లు జులైకే షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన కూడా రాబోతోంది.

ఎటు చూసుకున్నా కింగ్ డమ్ వాయిదా తప్పేలా లేదు. ఎందుకంటే పోటీ నడుమ కింగ్ డమ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీగా లేరు. సోలోగా వచ్చి ఎక్కువ వసూళ్లు రాబట్టాలని చూస్తున్నారంట. అందుకే మరోసారి వాయిదా వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. జులై 25కు వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read Also : Daggubati Purandeswari: ఐదేళ్లు రాక్షస పాలన చూసాం..!

Exit mobile version