పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – డైనమిక్ యాక్టర్ విజయ్ దేవరకొండ ఫస్ట్ కాంబోతో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ రిలీజ్ కాకుండానే వారి సెకండ్ ఫిల్మ్ ‘జేజీఎం’ (జన గణ మన) రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. శనివారం ప్రారంభమైన ఈ సినిమాలో ఫారిన్ టెక్నికల్ క్రూ కూడా వర్క్ చేస్తోంది. తొలి రోజునే హీరోయిన్ పూజా హెగ్డే సైతం షూటింగ్ లో పాల్గొంది. పూజా ఆన్ బోర్డింగ్ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెకు స్వాగతం పలికారు.
పూజా హెగ్డే యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతోంది. పూరి కనెక్ట్, శ్రీకర స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి, సింగారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబైలో మొదలైన ఈ సినిమా షూటింగ్ దేశ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను వచ్చే యేడాది ఆగస్ట్ 3న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.