Vijay Deverakonda: రేషన్ షాప్ కి ఆధార్ ఎందుకు? ట్రోలింగ్ చేయడమే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసిన సోషల్ మీడియాలో ఒక వర్గం మాత్రం ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎప్పటికప్పుడు విజయ్ ఫోటో బయటకి వచ్చినా కూడా నెగటివ్ ట్రెండ్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండపైన ఈ హేట్రెడ్ కి కారణం ఏంటో తెలియదు కానీ విజయ్ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా నెగటివ్ కామెంట్స్ మాత్రం సర్వసాధారణం అయిపొయింది. లేటెస్ట్ గా ఇలాంటిదే ఒకటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఫ్యామిలీ స్టార్’. గీతా గోవిందం కాంబినేషన్ లో రిపీట్ చేస్తూ పరశురామ్… విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విజయ్ ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ లా కనిపించబోతున్నాడు. మృణాల్… విజయ్ కి వైఫ్ క్యారెక్టర్ ప్లాన్ చేస్తోంది. ది ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు “ఐరనే వంచాలా ఏంటి” అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
యాంటీ ఫ్యాన్స్ విజయ్ ని టార్గెట్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఈ డైలాగ్ ని పేరడీ చేసి వాడారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏప్రిల్ 5న ది ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అనే అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ రేషన్ షాప్ కి వెళ్తూ ఆధార్ కార్డుని తీసుకోని వెళ్తున్నాడు. దీంతో రేషన్ షాప్ కి ఆధార్ కార్డ్ ఎందుకు అన్నా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ కోసం బస్ లో చూపించడానికి తీసుకోని వెళ్తున్నాడు నీకు అవసరమా అని ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్లు చేస్తున్నారు. అయితే రేషన్ షాప్ లో ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే చాలు రేషన్ ఇస్తారు అనే విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు. ఈ విషయం తెలియకే విజయ్ దేవరకొండ పోస్టర్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నట్లు ఉన్నారు.
Also Read
- Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
- Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
- Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
- Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
తాజావార్తలు
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!