Site icon NTV Telugu

Vijay Devarakonda : అతని మ్యూజిక్ వింటూ ఎమ్మారై స్కాన్ చేయించుకున్నా

Vijay

Vijay

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విజయ్ సినిమాకు ఫస్ట్ టైమ్ అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్.. ఇందులో అనిరుధ్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇందులో అతను మాట్లాడుతూ.. ‘అనిరుధ్ తో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉండేది. చాలాసార్లు నా సినిమాలకు అతన్ని తీసుకోవాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. చివరకు ఇప్పుడు కుదిరింది. అనిరుధ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. వీఐపీ సినిమాకు అతని మ్యూజిక్ విని స్టన్ అయిపోయాను.

Read Also : Pawankalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పాల్గొనేది అప్పటి నుంచే..!

కింగ్ డమ్ సినిమాలో అతని మ్యూజిక్ కు నేను నటిస్తున్నట్టు నాకు అనిపించేది. అంత అద్భుతంగా మ్యూజిక్ అందించాడు అనిరుధ్. నాకు ఓ సారి భుజానికి గాయం అయింది. ఎమ్మారై స్కాన్ తీయించుకోమన్నారు. దానికి 40 నిముషాలు ఎమ్మారై మిషిన్ లోనే ఉండాలని చెప్పారు. అంతసేపు ఉండాలంటే బోర్ కొడుతుందని.. నేను మ్యూజిక్ వింటానని వాళ్లకు చెబితే సరే అన్నారు. అందులో ఉన్నంత సేపు నేను అనిరుధ్ మ్యూజిక్ వింటూ గడిపాను. అతని పాటలు నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను రాజునైతే గనక అనిరుధ్ ను కిడ్నాప్ చేస్తాను. నాకు ఇష్టమైన ఆర్టిస్టులను కిడ్నాప్ చేయించి నా సినిమాలకు మాత్రమే పనిచేసేలా చూస్తాను’ అంటూ తెలిపాడు విజయ్ దేవరకొండ.

Read Also : Jammu Kashmir: ‘‘లొంగిపోవాలని ఉగ్రవాదిని కోరిన తల్లి’’.. ఎన్‌కౌంటర్‌లో హతం..

Exit mobile version