VD11 : విజయ్ దేవరకొండ, సామ్ మూవీ గ్రాండ్ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో మరో క్రేజీ మూవీకి రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనుంచి అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ విజయ్-సామ్ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌లో విజయ్, సమంతతో కలిసి స్క్రీన్‌ను పంచుకోనున్నారు. ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో లాంఛనంగా జరిగాయి. ఈ వేడుకకు దర్శకుడు హరీష్ శంకర్, బుచ్చిబాబు, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, విజయ్ దేవరకొండ తదితరులు హాజరయ్యారు. కానీ సమంత మాత్రం కన్పించలేదు.
Read also : Akshay Kumar : పాన్ మసాలా యాడ్ సెగ… సారీ చెప్పి తప్పుకున్న హీరో
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
‘VD11’ మూవీ లాంచ్ ఈవెంట్‌లో తొలి క్లాప్‌ని హరీష్ శంకర్, బుచ్చిబాబు సాన కెమెరా స్విచాన్ చేయగా, స్క్రిప్ట్‌ను మైత్రీ నిర్మాతలు శివ నిర్వాణకు అందజేశారు. తొలి షాట్‌కి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా, రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచే ప్రారంభం కానుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కాశ్మీర్‌లో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. త్వరలో జరగనున్న షెడ్యూల్స్ కోసం టీమ్ హైదరాబాద్, వైజాగ్, అలెప్పీలకు వెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి మలయాళ సినిమా ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. ప్రస్తుతం ‘VD11’ మూవీ లాంచ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!