NTV Telugu Site icon

JGM: పూరీ డ్రీం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్.. డెడ్లీ కాంబోలో వార్ స్టార్ట్

JGM

JGM అంటూ హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది. “లైగర్” తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు ముంబైలో గ్రాండ్ గా లాంచ్ కానుంది. దానికి ముందు విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్‌లో ముంబై చేరుకున్నాడు. విజయ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే సినిమా లాంచ్ కోసం ముంబై చేరుకున్న ఛార్మీ కౌర్, పూరీ జగన్నాధ్, వంశీ పైడిపల్లితో విజయ్ పోజులిచ్చిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Read Also : Sivakarthikeyan : ప్రముఖ నిర్మాతపై హీరో కేసు… ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు ఫిట్టింగ్

ఇదిలా ఉండగా ఛార్మి JGM అంటూ సినిమా పేరుతో ఉన్న పోస్టర్ ను రివీల్ చేసింది. పూరీ జగన్నాథ్ చాలా కాలంగా “జనగణమన” అనే సినిమాను చేయాలనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అదే. ఈ ఆసక్తికరమైన పోస్టర్ లో సినిమాను 2023 ఆగష్టు 3న విడుదల చేయనున్నట్టుగా వెల్లడించారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.