రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అందాల తార సమంత కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పేరును ప్రకటిస్తూ.. మేకర్స్ నేడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విజయ్-సమంత నటిస్తున్న ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరును ఖరారు చేశారు చిత్రయూనిట్. ఒక ఎపిక్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ధృవీకరించారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక మనోహరమైన వైబ్‌తో.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా కనిపిస్తున్నారు.
‘ఖుషి’ నిజంగా హ్యాపీ కలర్‌ఫుల్ రొమాన్స్‌గా ఉండబోతోందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ, సమంతల మధ్య కెమిస్ట్రీ పోస్టర్‌లోనే కనిపిస్తోంది. అయితే ఈ సినిమా.. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జయరామ్, సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య లు ఈ సినిమాలో నటిస్తున్నారు.
