NTV Telugu Site icon

Kushi: అతి చేశారా? ‘ఖుషి’ చేశారా?

Kushi

Kushi

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. మెగాస్టార్‌ లాంటి వ్యక్తిని కూడా వదిలిపెట్టడం లేదంటే ట్రోలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంతను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు కొందరు. తాజాగా నిర్వహించిన ఖుషి మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్‌లో రౌడీ, సామ్ రచ్చ చేశారు. లైవ్‌లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు. అస్సలు ఏ మాత్రం ఆలోచించకుండా సమంతను గాల్లో తిప్పుతూ ఆడిటోరియం దద్దరిల్లేలా చేశాడు విజయ్ దేవరకొండ. షర్ట్ తీసేసి మరీ సామ్‌తో కలిసి స్టెప్పులేశాడు రౌడీ. దీంతో కొందరు కావాలనే వీళ్లు అతి చేశారని ట్రోల్ చేస్తున్నారు. సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ నిజమేనా? రౌడీ ఆ రచ్చ ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే… వీళ్లు అలా చేశారు కాబట్టే అందరూ ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు, అందుకు సంబంధించిన వీడియో కూడా ట్రెండ్ అవుతోంది. సినిమా పై కావాల్సినంత బజ్ రావాలంటే… ఇలాంటి ప్రమోషన్స్ ఉండాల్సిందే.

అది కూడా విజయ్, సామ్ తమ అభిమానులను ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. వీళ్ల పర్ఫార్మెన్స్‌కు ఆడిటోరియం ఈలలు, అరుపులతో దద్దరిల్లిపోయింది. కొంతమందికి వీళ్ల బిహేవియర్ అతి అనిపించినా… రౌడీ ప్రమోషన్స్ రూటే సపరేట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. వాళ్లు ఏం చేసినా సినిమా కోసమే కాబట్టి ఖుషి ఈవెంట్ సూపర్ హిట్ అయింది. రీసెంట్‌గా వచ్చిన జైలర్ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. వారం రోజుల ముందు జరిగిన జైలర్ ఈవెంట్‌లో రజనీ కాంత్ స్పీచ్ హైలెట్‌గా నిలవడంతో ప్రమోషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఖుషి విషయంలోను మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్ అదిరిపోయిందనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో… శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లోకి రానుంది. మరి అప్పటి వరకు రౌడీ, సామ్ ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.

Show comments