NTV Telugu Site icon

Sreeleela: చిన్నా లేదు.. పెద్దా లేదు.. అందరి కన్ను పాప మీదే..?

Sreeleela

Sreeleela

Sreeleela:హీరోయిన్లు.. ఎప్పుడు ఎవరి దశ తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. కొంతమంది హీరోయిన్లకు కొన్ని సినిమాలు చేసిన తర్వాత స్టార్ డమ్ అందుకుంటారు. ఇంకొంతమంది మొదటి సినిమాతోనే అందుకుంటారు. ఇక తాజాగా ముద్దుగుమ్మ శ్రీలీల రెండో కోవలోకి వస్తోంది. పెళ్లి సందడి సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామను చూసి ఇండస్ట్రీ మొత్తం ప్రేమలో పడిపోయింది. చలాకీతనం, ముఖంలో అమాయకత్వంతో అందరి మనసులను దోచేసింది. ఇక సినిమాలు ఎంచుకొనే విధానంలో కూడా అమ్మడి శ్రమ గట్టిగా కనిపిస్తోంది. వచ్చిన సినిమాల మొత్తాన్ని ఎంచుకోకుండా కేవలం స్టార్లను మాత్రమే టార్గెట్ చేసింది. మొదటి సినిమా తరువాతనే రవితేజ తో కలిసి ధమాకా లో చిందులేసి హిట్ అందుకొంది. ఇక దీని తరువాత మహేష్ బాబు సరసన ఛాన్స్ పట్టేసింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా కొంతమంది హీరోయిన్లు అందుకొని అవకాశాలను శ్రీలీల కేవలం రెండో సినిమాతోనే అందుకుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన నటించే బంపర్ ఆఫర్ కూడా పట్టేసి పక్క హీరోయిన్లు కుళ్ళుకోనేలా చేసింది.

Anand Deverakonda: ‘బేబీ’తో సెన్సేషనల్ సింగర్ ఆర్య దయాళ్ టాలీవుడ్ ఎంట్రీ

ఇక తాజాగా మరో స్టార్ హీరో కంట్లో శ్రీలీల పడినట్లు తెలుస్తోంది. అతడే మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఖుషీ సినిమాను ఫినిష్ చేస్తున్న విజయ్ .. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబోకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్వరలోనే ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన శ్రీలీల ఎంపిక అయ్యినట్లు తెలుస్తోంది. జెర్సీ సినిమాతో హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి తరువాత ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కథలో శ్రీలీల పాత్రకు ఎంతో ప్రాధాన్యముందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం చిన్న హీరో లేదు.. పెద్ద హీరో లేదు.. అందరికి శ్రీలీలనే బెస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. మరి ఇన్ని సినిమాల్లో అమ్మడు ఎన్ని హిట్లు కొడుతుందో.. ఎన్ని ప్లాపులు మూటకట్టుకుంటుందో చూడాలి.