Site icon NTV Telugu

Vijay Devarakonda-Rashmika: గుట్టుచప్పుడు కాకుండా.. విజయ్‌ దేవరకొండ-రష్మిక నిశ్చితార్థం

Vijay Devarakonda Rashmika

Vijay Devarakonda Rashmika

 

Vijay Devarakonda-Rashmika: తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యంత డిమాండ్‌ జంటగా నిలిచిన హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్‌తో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసారు. కొన్నేళ్లుగా ప్రేమ సంబంధంలో ఉన్న ఈ జంట గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెల్చుకుంది.

లవ్ కపుల్‌ అయిన విజయ్‌-రష్మిక ల రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో తరచూ రూమర్స్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తమ లవ్ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ ఉదయం విజయ్‌ దేవరకొండ నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

ఫ్యాన్స్, సినీ పరిశ్రమలోవారు ఈ గీతగోవిందం కపుల్‌ విడివిడిగా చూసే క్షణాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరైన స్నేహితులే పాల్గొన్నారు. ఈ అనౌన్స్‌మెంట్‌ తర్వాత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వివిధ విధాలుగా శుభాకాంక్షలు పంపుతున్నారు.

 

 

Exit mobile version