Site icon NTV Telugu

Liger: ‘లైగర్’ ప్లాప్.. విజయ్ దేవరకొండ షాకింగ్ ఆన్సర్

Untitled 1

Untitled 1

Liger: ప్రస్తుతం ఎక్కడ చూసిన లైగర్ గురించే చర్చ. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను పూరి, ఛార్మి మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు. ఇంకోపక్క రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా మారారు.

ఇక ఒక ఇంటర్వ్యూలో విజయ్ కు ఒక వింత ప్రశ్న ఎదురయ్యింది. లైగర్ ప్లాప్ అయితే మీరేం చేస్తారు అన్న ప్రశ్నకు రౌడీ హీరో షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ సినిమా ప్లాప్ అయితే మరొక సినిమా చేస్తా అంటూ సింపుల్ గా చెప్పడంతో పాటు అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు ఏదో ఒకరోజు వారికి మంచి సినిమాను తిరిగి ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. “ఒకప్పుడు ఈ ప్రశ్న అడిగితే చాలా కోపం వచ్చేదేమో.. కానీ ఇప్పుడు రావడం లేదు. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో నేను దేశం మొత్తం తిరిగాను. ఎక్కడ చూసిన అభిమానులు నా మీద చూపించిన అభిమానం నన్ను మార్చింది. ఆ ప్రేమాభిమానాలను నేను మర్చిపోలేను. నాకు ప్రేక్షకులు ముఖ్యం.. నా అభిమానులు ముఖ్యం.. వారికోసం సినిమాలు చేస్తూనే ఉంటాను. వారి మనసులను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version