Site icon NTV Telugu

షణ్ముఖ ప్రియకి విజయ్ దేవరకొండ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్!

విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన సందేశం అందించాడు! ఆయన పంపిన స్పెషల్ వీడియో షణ్ముఖ ప్రియ కోసం ప్లే చేశారు! ఆమె తప్పకుండా ‘ఇండియన్ ఐడల్ 12’ టైటిల్ గెలుస్తుందని విజయ్ నమ్మకంగా చెప్పాడు కూడా! ఇక షణ్ముఖ స్టార్ హీరో కనిపించటంతోనే ఉబ్బితబ్బిబైపోయింది!

ఆదివారం, ఆగస్ట్ 15న మధ్యాహ్నం 12 నుంచీ రాత్రి 12 దాకా 12 గంటల పాటూ ఇండియన్ ఐడల్ ఫినాలే జరగనుంది. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ సంగీత సమరాన్ని వీక్షిస్తారని అంచనా. అయితే, ఫైనల్ సిక్స్ కంటెస్టెంట్స్ లో మన తెలుగు అమ్మాయి షణ్ముఖ కూడా ఉంది. ఆమెని చీరప్ చేయటానికి స్వయంగా విజయ్ దేవరకొండ రంగంలోకి దిగాడు. ‘లైగర్’ స్టార్ స్పెషల్ వీడియో మెసేజ్ లో ఆమెకు బ్లెస్సింగ్స్ అందించటంతో పాటూ బెస్ట్ విషెస్ తెలియజేశాడు. షణ్ముఖ పర్ఫామెన్సెస్ తాను చూస్తుంటానని అన్నాఆయన ఆమె ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు.

అంతే కాదు, షణ్ముఖ ఆనందానికి కట్టలు తెంచుతూ ‘హైద్రాబాద్ తిరిగి రాగానే నా సినిమాలో నువ్వు పాట పాడుదువుగానీ’ అన్నాడు! దేవరకొండ ఆఫర్ తో షణ్ముఖ ప్రియ ఎగిరి గంతేసింది… సొషల్ మీడియా మాధ్యమాల్లో విజయ్ దేవరకొండ ఇండియన్ ఐడల్ 12 వీడియో తెగ వైరల్ అవుతోంది. షణ్ముఖ ఫ్యాన్స్ జోరుగా షేర్ చేస్తున్నారు…

Exit mobile version