Vijay Kanakamedala : ‘భైరవం’ మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల తాజాగా మెగా ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు చెప్పారు. గతంలో తన ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన స్వయంగా ప్రకటించారు. ట్విట్టర్ లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ‘నేను మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితుడిని. నా కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా మెగా హీరోలతోనే. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు పనిచేసినప్పుడు ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సాయిధరమ్ తేజ్ ను పరిచయం చేసి.. మంచి కథ ఉంటే అతనితో మూవీ చేయమని అడిగారు.
Read Also : నాయకన్ సినిమా చూసి మణిరత్నం గొంతు కోశా : సుహాసిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నేను చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలు చూసి వాళ్ల స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను. అలాంటిది వాళ్లను నేనెందుకు దూరం చేసుకుంటాను. 2011లో నేను నా ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టినట్టు ట్రోలింగ్ జరుగుతోంది. ఆ పోస్టు పెట్టింది నేను కాదు. బహుషా నా అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చు. కానీ నా ఫేస్ బుక్ ఐడీ కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నాను.
ఇలాంటి పొరపాటు మరోసారి జరగదు. మనస్ఫూర్తిగా చిరంజీవి, పవన్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి నా మీద, నా సినిమా మీద ట్రోలింగ్ ఆపండి’ అంటూ విజయ్ కనకమేడల రాసుకొచ్చారు. ఆయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై మెగా ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read Also : Spirit: ‘స్పిరిట్’ దీపికా పదుకొణె అవుట్.. రుక్మిణి వసంత్ ఎంట్రీ!
