Site icon NTV Telugu

Love Guru: సమ్మర్ లో విజయ్ ఆంటోనీ “లవ్ గురు” రిలీజ్?

Love Guru

Love Guru

Vijay Antony’s Love Guru is gearing up for summer release: వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న రోమియో మూవీ తెలుగులో “లవ్ గురు” పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. : బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. గత ఏడాది బిచ్చగాడు 2 తో మరో విజయాన్ని అందుకొని తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హత్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు. ఇక దీంతో విజయ్ రూట్ మార్చి ఇప్పటివరకు యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్ తో ప్రేక్షకులను మెప్పించి ఇప్పుడు సడెన్ గా లవ్ గురు గా మారిపోయాడు.

Miss Perfect Review: మిస్ పర్ఫెక్ట్ రివ్యూ: పెళ్లయ్యాక మెగా కోడలి మొదటి వెబ్ సిరీస్ హిట్టా? ఫట్టా?

ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోండగా “లవ్ గురు” సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్న “లవ్ గురు” సినిమా నుంచి రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. శోభనం రోజు గదిలో భర్త ఆశ్చర్యపోతూ చూస్తుండగా..భార్య పాలు బదులు రమ్ కలిపి ఇవ్వడాన్ని పోస్టర్ లో రివీల్ చేశారు. భార్యాభర్తలుగా విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇలా సింబాలిక్ గా పోస్టర్ ద్వారా చూపించారు మేకర్స్. త్వరలో “లవ్ గురు” సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించనున్నారు.

Exit mobile version