Site icon NTV Telugu

Vijay Antony: బిగ్ బ్రేకింగ్.. విజయ్ కు బోటు ప్రమాదం

Vijay Antony

Vijay Antony

Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో విజయ్ ఆంటోని. నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా విజయ్ ఎన్నో సినిమాలకు పనిచేశాడు. కానీ, బిచ్చగాడు సినిమా విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 ను విజయ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా తాజాగా ఈ షూటింగ్ లో విజయ్ గాయపడ్డాడు. అసలు ఏం జరిగిందంటే.. విజయ్ బిచ్చగాడు 2 షూటింగ్ మలేషియాలో జరుగుతోంది.

కొన్ని యాక్షన్ సీన్స్ కోసం విజయ్ బోట్ లో ప్రయాణిస్తుండగా.. బోట్ అతివేగం వలన అది పక్కనే ఉన్న పడవను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడిలో విజయ్ కు తీవ్ర గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. వెంటనే విజయ్ ను చిత్ర బృందం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ్ పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏం లేదని వైద్యులు తెలిపారు. ఆయన ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే మలేషియాకు పయనమయ్యారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version