NTV Telugu Site icon

Hitler : చిరంజీవి టైటిల్ తో విజయ్ ఆంటోనీ.. ‘’హిట్లర్’’ అంటూ వచ్చేస్తున్నాడు!

Hitler Movie Telugu

Hitler Movie Telugu

Hitler Movie First Look Released: చేస్తున్న అన్ని సినిమాలు వైవిధ్యమైనవి ఉండేలా చూసుకుంటున్న సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా హిట్లర్ తో తెరపైకి రాబోతున్నారు. గతంలో చిరంజీవి హిట్లర్ సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు అదే పేరుతో విజయ్ ఆంటోనీ సినిమా వస్తోంది. విజయ్ ఆంటోనీతో గతంలో విజయ్ రాఘవన్ అనే మూవీని నిర్మించిన చందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా హిట్లర్ సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలుగా ఈ హిట్లర్ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్రైన్ జర్నీలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ ను ఎదుర్కొన్నట్లు మోషన్ పోస్టర్ లో చూపించగా ఇదే ట్రైన్ లో హీరోయిన్ రియా సుమన్ హీరో కలుసుకుంటాడని తెలుస్తోంది. ఇక గన్ పేలుస్తోన్నట్టు కనిపిస్తున్న గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రలో నటించారని అర్ధం అవుతోంది.

Anukreethy Vas : ‘టైగర్ నాగేశ్వర రావు’ కోసం రంగంలోకి తమిళ బ్యూటీ.. బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

చివరలో విజయ్ అంటోనీ జోకర్ గెటప్ లో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ట్రైన్ జర్నీ నేపథ్యంగా రూపొందించిన మోషన్ పోస్టర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు అయితే అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే హిట్లర్ అని అంటున్నారు. హిట్లర్ అనేది ఒక పేరు కావొచ్చు కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య పరిస్థితుల్లో ఆ పేరు నియంతలకు మారుపేరుగా మారింది, అందుకే సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ అనుకున్నాం అని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం షూట్ తుది దశలో ఉన్న హిట్లర్ మూవీని త్వరలో పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ,తెలుగు,మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు.

Show comments