NTV Telugu Site icon

Bichagadu 2: బిచ్చగాడి రేంజ్ మారింది… ట్రైలర్ విజువల్స్ అదిరిపోయాయి

Bichhagadu 2

Bichhagadu 2

2016లో రిలీజ్ అయిన బిచ్చగాడు సినిమా తెలుగు బయ్యర్ కి కాసుల వర్షం కురిపించింది. అమ్మ సెంటిమెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో రిపీట్ మోడ్ లో బిచ్చగాడు సినిమాని చూశారు. ఈ మూవీ వచ్చిన ఏడేళ్లకి ఇప్పుడు బిచ్చగాడు 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. మే 19న బిచ్చగాడు 2 సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ మేకర్స్ బిచ్చగాడు 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. గ్రాండ్ విజువల్స్, మంచి యాక్షన్స్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, రియలిస్టిక్ సెటప్ బిచ్చగాడు 2 ట్రైలర్ లో కనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని మరింత ఎలివేట్ చేసింది. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ పై సీన్స్ ని కూడా ట్రైలర్ లో చూపించారు. బిచ్చగాడు 2 అనే పేరు మాత్రమే ఉంచి మిగిలిన అన్ని విషయాల్లో స్టేక్స్ ని పెంచాడు విజయ్ అంటోని.

Read Also: Virupaksha: మొత్తానికి బౌండరీలు దాటుతున్నారు… ఈవారం కూడా విరుపాక్షదే

తనే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కావడంతో బిచ్చగాడు 2 సినిమాని ఎలాంటి లోటు లేకుండా తెరకెక్కించినట్లు ఉన్నాడు. ఈ ట్రైలర్ లో మేజర్ డిజప్పాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అమ్మ సెంటిమెంట్ మాత్రమే. బిచ్చగాడు సినిమాకి ఆయువు పట్టు లాంటి అమ్మ సెంటిమెంట్, ఈ ట్రైలర్ లో కనిపించలేదు. ఈ విషయంలో ఆడియన్స్ కి సిస్టర్ సెంటిమెంట్ తో ఎమోషన్ ని పంచేలా ఉన్నాడు విజయ్ అంటోనీ. ఒక స్టార్ హీరో సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న బిచ్చగాడు 2 ట్రైలర్, సినిమాపై అంచనాలని పెంచింది. మరి మదర్ సెంటిమెంట్ లేని ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఫేస్ చేస్తుందో చూడాలి.