Vidya Balan: సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలను తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకున్నది ఎవరిని.. ? ఎంతమంది పిల్లలు ఉన్నారు..? వారు ఎక్కడ చదువుతున్నారు.. ? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక పిల్లలతో కలిసి ఒక సెలబ్రిటీ బయటకు వచ్చారు అంటే.. వాళ్ళు వెళ్లెవరకు కెమెరాలకు పని చెప్తూనే ఉంటారు. నిజంగా వారు కుటుంబంతో వచ్చారా.. ? లేదా .. ? అన్న విషయాన్నీ కూడా వారు పట్టించుకోరు. ఎవరు పక్కన ఉంటే.. వారు సెలబ్రటీల పిల్లలు అని రాసుకొచ్చేస్తారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ విషయంలో బాలీవుడ్ మీడియా అలానే ప్రవర్తించింది. ఆమె పక్కన ఉన్న ఒక పాపను చూసి.. కూతురు.. కూతురు అని రాసుకొచ్చేసింది. విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Amitabh Bachchan: అమితాబ్ బర్త్ డే పోస్టర్.. అన్నా.. సినిమాలో అయినా ఫేస్ చూపిస్తారా.. ?
డర్టీ పిక్చర్ సినిమాతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ఈ భామ తెలుగులో బాలయ్య సరసన కథానాయకుడు లో నటించింది. ఈమె 2012లో నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్‌ను పెళ్లాడింది. వీరికి ఇప్పటివరకు పిల్లలు లేరు. ఇక నేడు.. ఈ భామ ఎయిర్ పోర్టులో ఒక 10 ఏళ్ల చిన్నారితో కనిపించింది. ఎంతో ప్రేమగా మాట్లాడుతూ.. చిన్నారిని దగ్గరకు తీసుకుంటూ కనిపించింది విద్యాబాలన్. దీంతో బాలీవుడ్ మీడియా.. ఆమె విద్యాబాలన్ కూతురు అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ వార్తలపై విద్యాబాలన్ స్పందించింది. ” ఆ అమ్మాయి పేరు ఐరా.. ఆమె నా సొంత కూతురు కాదు. నా అక్క కూతురు. వారు ట్విన్స్.. అందులో ఒకరే ఐరా” అని పేర్కొంది. దీంతో ఈ వార్తలకు చెక్ పడింది.