NTV Telugu Site icon

Bubblegum: హబీబీ జిలేబి అంటున్న యాంకర్ సుమ కొడుకు

Habibi Jilebi

Habibi Jilebi

Victory Venkatesh Launched First Single Habibi Jilebi From Bubblegum: విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన రోషన్ కనకాల, మానస చౌదరి ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబి సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ‘బబుల్‌గమ్‌’ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా విక్టరీ వెంకటేష్ ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ సాంగ్ ని లాంచ్ చేయడంతో సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైయిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.. ఈ సందర్భంగా పాటను రిలీజ్ చేస్తూ వెంకటేష్ యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీచరణ్ పాకాల మాస్, యూత్-ఆకట్టుకునే పెప్పీ ట్రాక్‌ గా కంపోజ్ చేసిన ఈ పాట లీడ్ పెయిర్ డ్యాన్స్ పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చినట్టుంది అని చెప్పొచ్చు. ఇక రోషన్ కనకాల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నారని చెప్పచ్చు.

Skanda: బాగోలేదంటూనే తెగ చూస్తున్నారు కదరా!

పాపులర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన హై-పిచ్ వోకల్స్ తో అదనపు ఎనర్జీని నింపగా కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ పెప్పీ ట్రాక్ తెలుగు సినిమా ప్రేమికులకు మ్యూజిక్, విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. సరికొత్త రొమాంటిక్ జర్నీతో ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోనుందని అంటున్నారు. గరుడవేగ, తెల్లవారితే గురువరం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. ఇక హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.