ప్రస్తుతం స్టార్లందరూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి , బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. చాలామంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో అడుగుపెట్టి తమ సత్తాను చాటుతున్నారు. ఇక తాజాగా వెంకీ మామ సైతం బాలీవుడ్ బాట పట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్ అయ్యి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు వెంకీ మామ డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారట. అది కూడా అలంటి ఇలాంటి ఎంట్రీ కాదు. ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ద్వారా వెంకీ మామ బాలీవుడ్ ఎంట్రీ ఉందనున్నదట. వెంకటేష్ కి హీరోగానే చేయాలని రూల్ ఏం లేదు. ఆయన కథ నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేయడానికి ప్రాధాన్యత చూపిస్తారు. ఇప్పటివరకు వేరే హీరోలతో ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక హీరో వెంకీ మామనే.. ఇప్పడూ ఏకంగా సల్మాన్ భాయ్ తో కూడా వెంకీ మామ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాళి’ లో వెంకీ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఎప్పుడో మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడడంతో అస్సలు ఈ చిత్రం తెరక్కుతుందా..? అనే డౌట్ అభిమానులకు కూడా వచ్చింది. అయితే ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ప్రకటించడంతో మరోసారి ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. అందులోనూ వెంకీ మామ కూడా ఉన్నాడంటే సినిమా పక్కా హిట్ అన్న విషయం తెలిసిందే . త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారట. మరి తెలుగులో విక్టరీనే ఇంటిపేరుగా చేసుకున్న వెంకీ మామ బాలీవుడ్ లో కూడా విక్టరీ మోత మోగిస్తాడేమో చూడాలి.
