NTV Telugu Site icon

Manipur: మణిపూర్ లో ‘ఉరి’.. 23 ఏళ్ళ తరువాత మొదటిసారి

Uri

Uri

Manipur: మణిపూర్ .. ఈ పేరు గత కొన్ని రోజులగా దేశ ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న విషయం తెల్సిందే. వెన్నులో వణుకుపుట్టేలా మణిపూర్ లో జరిగిన అల్లర్లు.. హత్యలు ఎంతటి సంచలాన్ని సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్యనే ఈ అల్లర్లు ఆగడంతో ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మణిపూర్ లో స్కూల్స్, మాల్స్ ఓపెన్ అవ్వడంతో కళకళలాడుతుంది. తాజాగా ఈ రాష్ట్రంలో సినిమా ప్రదర్శనలు కూడా మొదలుపెట్టనున్నారు. అది కూడా హిందీ సినిమా. 23 ఏళ్ళ క్రితం మణిపూర్ లో హిందీ సినిమాలను బ్యాన్ చేసిన విషయం తెల్సిందే. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో హిందీ సినిమా ప్రదర్శించవద్దని మైతీ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అప్పటినుంచి ఆ రాష్ట్రంలో హిందీ సినిమాల ప్రదర్శన నిలిపివేశారు. ఇక 23 ఏళ్ళ తరువాత మొట్టమొదటిసారి ఒక హిందీ సినిమాను ప్రదర్శించడానికి హమర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ అంగీకారం తెలిపింది.

Neha Shetty: స్టేజిపై చీరతో విశ్వక్ ను చుట్టేసి రొమాన్స్ చేసిన నేహా..

ఇక మంగళవారం చురాచందాపూర్‌ జిల్లాలో ఓపెన్ ఎయిర్ థియేటర్ లో హిందీ హిట్ సినిమా ఉరి.. ది సర్జికల్ స్ట్రైక్ సినిమాను ప్రదర్శించారు. ఇక ఈ సినిమా చూడడానికి ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు. విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా హిందీలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హౌ ఈజ్ ది జోష్ అనే డైలాగ్ ను ఇప్పటికీ ఎక్కడో చోట వాడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలాంటి యుద్ధం చేస్తున్నారు.. ప్రాణాలను అడ్డుపెట్టి దేశాన్ని ఎలా కాపాడుతున్నారు.. ? అనేది ఉరి సినిమాలో చూపించారు. ఇక నుంచి హిందీ సినిమాలు మణిపూర్ లో కూడా రిలీజ్ కానున్నాయి. ఇది మంచి విషయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.