Site icon NTV Telugu

బ్యాడ్ న్యూస్ : విక్కీ కౌశల్ “అశ్వద్ధామ”కు బ్రేక్

Vicky Kaushal's The Immortal Ashwatthama Getting Shelved?

బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ భారీ బడ్జెట్ మూవీ ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’. తాజగా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసిన 30 కోట్ల రూపాయలు వేస్ట్ అయ్యాయని అంటున్నారు. బాలీవుడ్ మీడియా ప్రకారం ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’ చిత్రాన్ని మేకర్స్ పూర్తిగా పక్కన పెట్టేశారట. ఈ చిత్ర నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చేశాడని, సినిమా మొత్తం బడ్జెట్‌ను చూసుకుంటే అది చాలా ఎక్కువని భావించాడని అంటున్నారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా సినిమాలు థియేటర్లలో పెద్దగా బిజినెస్ చేయలేకపోతున్నాయి.దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Read Also : “ఘోస్ట్”గా మారిన నాగార్జున

ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు 2 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆదిత్య ధర్ అనేక లొకేషన్లను సందర్శించి వాటిలో కొన్నింటిని షూటింగ్ కోసం ఫిక్స్ చేశారట. మరోవైపు మేకర్స్ విఎఫ్ఎక్స్ కోసం కూడా పని చేయడం మొదలుపెట్టారు. మొత్తంగా ఈ చిత్రాన్నినిర్మించడానికి ముందే 30 కోట్లు ఖర్చు అయ్యాయట. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రం ఆగిపోతే విక్కీ కౌశల్ కు భారీ నష్టమని చెప్పొచ్చు. ఇది ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భారీ చిత్రం. విక్కీ, సారాకు ఈ చిత్రం కాకుండా మరో ప్రాజెక్ట్ లో కలిసి నటించమని మేకర్స్ ఆఫర్ ఇచ్చారట. ఇప్పటివరకు ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’ చిత్ర బృందం ఈ వార్తలపై రియాక్ట్ కాలేదు.

Exit mobile version