హాలీవుడ్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో నెట్‌ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మేన్’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదలవుతోంది. ఇక ఈ సినిమా ప్రచారంలో భాగంగా ‘గ్రే మేన్’ టీమ్ కి బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తోడుగా నిలిచాడు. ప్రమోషన్ వీడియో లో సందడి చేస్తూ అందులో ఉన్న సీక్రెట్ కోడ్ చెబితే దనుష్ తో పాటు ‘గ్రే మేన్’ ఇండియన్ ప్రీమియర్ షోలో పాల్గొనే అవకాశం కల్పించారు. ముంబై లో జులై 20 న జరిగే ఈ ప్రీమియర్ లో మూవీ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్ తో పాటు ధనుష్ ఇతర తారాగణం హాజరు కానున్నారు. ‘గ్రే మేన్’ జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనాడి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రలు పోషించారు. మార్క్ గ్రీన్ రాసిన ‘ది గ్రే మ్యాన్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో రసో బ్రదర్స్ ఈ సినిమాను రూపొందించారు.
Dhanush : ‘గ్రే మేన్’కి తోడుగా విక్కీ కౌశల్

Dhanush