NTV Telugu Site icon

Vetrimaaran: ఆయన సినిమాలకి ఆ రేంజ్ రెస్పాన్స్ మాములే సార్…

Vetrimaaran

Vetrimaaran

వెట్రిమారన్… పేరుకే తమిళ దర్శకుడు కానీ పాన్ ఇండియా మొత్తం తెలిసిన వాడు. జక్కన్న తర్వాత ఫ్లాప్ లేని హిట్ స్ట్రీక్ మైంటైన్ చేస్తున్న అతి తక్కువ మంది దర్శకుల్లో వెట్రిమారన్ ఒకడు. అందరు దర్శకులు పాన్ ఇండియా సినిమాలు, హీరో సెంట్రిక్ కమర్షియల్ సినిమాల వైపు వెళ్తుంటే… కెరీర్ స్టార్ట్ చేసి దశాబ్దమున్నర అవుతున్నా వెట్రిమారన్ ఇంకా కథాబలం ఉన్న సినిమాలనే స్టార్ హీరోలతో కూడా చేస్తున్నాడు. రూటెడ్ కథలని… రస్టిక్ గా చెప్పడంతో న్యాచురల్ గా నేరేట్ చేయడం వెట్రిమారన్ స్టైల్. అందుకే ఆయన సినిమాలు కామన్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాయి.  స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ సీన్స్, బ్లడ్ థంపింగ్ సీక్వెన్స్ లు వెట్రిమారన్ సినిమాలో మనకి రెగ్యులర్ గా కనిపించే విషయాలు.

Read Also: Family Star: హైదరాబాద్ లో మృణాల్-విజయ్… అయిదు రోజుల షూటింగ్

ఓవరాల్ గా నాలుగు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న వెట్రిమారన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ విడుదలై నుంచి పార్ట్ 2 రాబోతుంది. థియేటర్ రిలీజ్ కన్నా ముందు ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్తున్న విడుదలై పార్ట్ 2 సినిమాకి స్టాండింగ్ ఓవియేషన్ దక్కింది. రొట్టెర్ డామ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో… విడుదలై పార్ట్ 1&2 సినిమాలు ప్రీమియర్ అవ్వగా… దాదాపు 5 నిమిషాల పాటు ఆడియన్స్ ఆపకుండా చప్పట్లు కొట్టి చిత్ర యూనిట్ ని అభినందించారు. 5 నిమిషాల స్టాండింగ్ ఓవియేషన్… ఇతర సినిమాలకి చాలా పెద్ద విషయం ఏమో కానీ వెట్రిమారన్ సినిమాలకి అది సర్వసాధారణం అనే చెప్పాలి. మరి వెస్టర్న్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్న విడుదలై పార్ట్ 2 థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. తెలుగులో ఈ సినిమాని గీత ఆర్ట్స్ రిలీజ్ చేస్తోంది.