Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. సుమారు 94 ఏళ్ళ వయసులో వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు సమాచారం. దీంతో తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు యావత్ భారత సినీ జగత్తు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన జీవితంలో ఇటీవలే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ సమర్పణలో ఆయన దర్శకత్వం వహించిన సరికొత్త చిత్రం ‘సింగ్ గీతం’ ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. సినిమా చరిత్రలో తొలిసారిగా సంభాషణలను సైతం సంగీతమయంగా మార్చే పూర్తి స్థాయి ‘ఆల్-మ్యూజికల్’ ఫార్మాట్లో ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారు. సాధారణ డైలాగులు కాకుండా, పాత్రల భావోద్వేగాలన్నీ స్వరాల రూపంలోనే సాగడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు, ప్రతి దశాబ్దంలోనూ ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. టాకీ కాలంలో మాటలు లేని నిశ్శబ్ద హాస్య చిత్రం పుష్పక విమానంతో దేశవ్యాప్తంగా సంచలనం. భారతీయ వెండితెరకు కాల ప్రయాణం (Time Travel) కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన మార్గదర్శక సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 కూడా ఆయన సృష్టే. ఆధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని కాలంలోనే లెన్స్ ట్రిక్స్‌తో అపూర్వ సహోదరులుతో మరుగుజ్జు పాత్రను సృష్టించి సాంకేతిక విస్మయం కలిగించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేరు. దశాబ్దాల సినీ ప్రయాణంలో నిరంతరం కొత్తదనాన్ని అన్వేషించిన సింగీతం శ్రీనివాసరావు, ఈ వయసులోనూ సరికొత్త ఆలోచనలతో కథలను తెరకెక్కించవచ్చని నేటి తరం దర్శకులకు ఆదర్శంగా నిలిచారు అనడంలో సందేహం లేదు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!