NTV Telugu Site icon

Venu Tottempudi: ‘అతిథి’ గా వస్తున్న హీరో వేణు..

Venu

Venu

Venu Tottempudi: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరో వేణు తొట్టెంపూడి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వేణు.. ఈ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్.. ఇలా హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆరడుగుల ఈ ఆజానుబాహుడు.. తన నటనతోం కాకుండా కామెడీతో కూడా అభిమానుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. రామాచారి అనే సినిమా తరువాత వేణు సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చాడు. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన కుటుంబ వ్యాపారాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లాడు. ఇక చాలా ఏళ్ల తరువాత వేణు.. రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శరత్ మండవ .. తనను ఈ కథకోసం ఒప్పించాడని, సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని తానెప్పుడూ అనుకోలేదని వేణు చెప్పుకొచ్చాడు.

Dil Raju: హార్ట్ కింగ్.. చరణ్ ఫ్యాన్స్ హార్ట్ ను విరిచేశాడే

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ కు ముందు వేణు ఒక హైలైట్ లా నిలిచాడు. అయితే కథలో అంత దమ్ము లేకపోవడం.. వేణు పాత్రను సరిగ్గా మలచకపోవడంతో సినిమా ప్లాప్ అయ్యింది.. వేణు మళ్లీ సినిమాకు దూరమయ్యాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈసారి వస్తే రాజకీయాల్లోనే కనిపిస్తాను అని చెప్పిన ఈ హీరో .. తాజాగా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. అతిథి అనే వెబ్ సిరీస్ లో వేణు నటిస్తున్నాడు అంటూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలోనే ఈ సిరీస్ రానుంది. అయితే దీనికి డైరెక్టర్ ఎవరు.. ? మిగతా క్యాస్ట్ ఎవరు అనేది ఏమి చెప్పలేదు. అందరు అతిథులు ఆహ్వానితులు కాదు అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విరిగిన ఒక తలుపు లో నుంచి రక్తంతో తడిసిన వేణు కన్నును మాత్రమే చూపించారు. ఇక ఈ పోస్టర్ తో ఈ సిరీస్ ఏదో క్రైమ్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. ఈ సిరీస్ తో వేణు హిట్ అందుకుంటాడా.. ? లేదా..? అనేది చూడాలి.