Venu Thottempudi Athidhi Teaser: వర్సటైల్ యాక్టర్ వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ “అతిథి” స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ కంపెనీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి వచ్చిన సేవ్ ది టైగర్స్, సైతాన్, దయ వంటి సిరీస్ లు సూపర్ హిట్స్ అయిన నేపథ్యంలో “అతిథి”పై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ డైరెక్ట్ చేయగా ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు.
TOBY: కన్నడలో మరో కాంతర రేంజ్ మూవీ… బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది
తాజాగా “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్టు వెల్లడించారు. నిజానికి ఇటీవల రిలీజ్ చేసిన “అతిథి” వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా తాజాగా డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా అది కూడా జనాల్లో ఇంట్రెస్ట్ పెంచేలా ఉంది. ఈ టీజర్ లో భారీ వర్షంలో తడిసి పోయి ఓ అర్ధరాత్రి ఇంటికి వచ్చిన మహిళకు ఆతిథ్యం ఇస్తాడు హీరో వేణు. ఆ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం పెరుగడం ఇంతలో ఆమె భయంకరంగా బిహేవ్ చేయడంతో టీజర్ ఆసక్తికరంగా ముగుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్ “అతిథి” వెబ్ సిరీస్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోందని చెప్పక తప్పదు.