NTV Telugu Site icon

Venu Swamy: మానిపోతున్న పుండు మీద కారం చల్లిన వేణు స్వామి.. ఇక అసలు ఊరుకుంటారా?

Adipurush, Prabhas, Venu Swamy,salar,

Adipurush, Prabhas, Venu Swamy,salar,

Venu Swamy Counter to Prabhas Fans Trolls about Salaar Movie: టాలీవుడ్ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి అనేకమంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ల గురించి జాతకాలు చెప్పి మరింత పాపులారిటీ సంపాదించాడు. అలాంటి వేణు స్వామి ప్రభాస్ జాతకం ఏమీ బాలేదని ఆయన లైఫ్ లో ఉన్న మంచి రోజులన్నీ అయిపోయాయి అన్నట్టు ఇప్పుడు ప్రభాస్ కి బ్యాడ్ టైం నడుస్తోందని కొన్ని రోజుల క్రితం కామెంట్లు చేశారు. ఇప్పుడు ప్రభాస్ కి ఏ సినిమాలో వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు, ఆయనతో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్న నిర్మాతలు చేస్తున్న నిర్మాతలు జాతకాలు చూపించుకోవాలి అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఎందుకంటే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా విడుదలై మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుని హీట్ దిశగా పరుగులు పెడుతోంది. దీంతో వేణు స్వామిని ట్యాగ్ చేస్తూ అనేక రకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pannun murder plot: నిఖిల్ గుప్తా కేసులో ‘భారత అధికార పరిధి’ లేదు.. స్పష్టం చేసిన చెక్ రిపబ్లిక్..

మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ గురించి అవాకులు చవాకులు పేలావు మరి ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది దీనికి ఏమి సమాధానం చెబుతావు అంటూ వేణు స్వామిని ట్యాగ్ చేసి మరీ ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వేణు స్వామి స్పందిస్తూ మరోసారి ప్రభాస్ అభిమానులను కోపం తెప్పించే మాటలు మాట్లాడాడు. ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఆయన ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాము అంటూ దానికి సుదీర్ఘ వివరణ ఇచ్చుకొచ్చాడు. సూపర్ స్టార్ అంటే విడుదలైన సినిమాల్లో 90% సినిమాలు హిట్లు కొట్టడం అంతేకానీ విడుదలైన నాలుగు సినిమాల్లో ఒక సినిమా హిట్టు కొడితే ఏమనాలి రా,? నాలుగు సినిమాలకు ఒక హిట్టు కొట్టడం కాదురా ఆజాము అంటూ రాసుకు వచ్చాడు. ఆయన ఎవరో ఆస్ట్రేలియా వ్యక్తికి కౌంటర్ ఇస్తున్నట్టు అర్ధం అవుతోంది కానీ ఎవరికి ఇస్తున్నాడు? అనేది క్లారిటీ లేదు. దానికి తోడు ప్రభాస్ అభిమానులను మళ్ళీ కెలికేట్టు మానిపోతున్న పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడడం గమనార్హం. మాములుగా జాతకం బాలేదని అంటేనే ఊరుకోని ప్రభాస్ అభిమానులు, మీ హీరో అసలు సూపర్ స్టార్ కాదు అంటే ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు. చూడాలి మరి ఏమవుతుందో?