Venu Swamy: ప్రభాస్ కు ఒక్క హిట్ ఉండదు.. పనైపోయింది అన్నావ్ కదరా.. ఇప్పుడు చెప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని నాలుగేళ్ళ క్రితమే వేణుస్వామి చెప్పడం.. అది జరగడంతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు. ఒక్క సమంత విషయంలో ఈయన చెప్పింది జరగడంతో.. మిగతా అన్ని విషయాల్లో జరుగుతుందని కొంతమంది నమ్ముతూ వచ్చారు. అయితే ఈ ఏడాదిలో వేణుస్వామి చెప్పింది ఏది జరగకపోవడంతో ప్రతిఒక్కరు ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఇండియా వరల్డ్ కప్ ఈ ఏడాది కొడుతోంది అని చెప్పుకొచ్చాడు.. అది జరగలేదు. కేసీఆర్ మరోసారి సీఎం అవుతాడు అని చెప్పుకొచ్చాడు.. అది కూడా జరిగింది లేదు. ఇక ఈ ఏడాది వేణుస్వామిని ట్రోల్ చేయడానికి, ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కారణం.. కొన్నిరోజుల క్రితం ప్రభాస్ జాతకం ఈయన చెప్పడమే. ప్రభాస్ జాతకంలో శని నడుస్తుందని, హిట్లు ఉండవని, ప్రభాస్ పనిపోయిందని చెప్పుకొచ్చాడు.. అంతేకాకుండా పెళ్లి యోగం కూడా లేదు అని చెప్పాడు.
ఇక పెళ్లి గురించి ఏమో కానీ.. నేడు సలార్ సినిమా హిట్ అవ్వడంతో..వేణుస్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు. ప్రభాస్ కు ఒక్క హిట్ ఉండదు.. పనైపోయింది అన్నావ్ కదరా.. ఇప్పుడు చెప్పు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ ఈజ్ బ్యాక్.. అంటూ చెప్పుకొస్తున్నారు. మాములుగా ప్రభాస్ జాతకాలు నమ్మడట.. వాళ్ళ కుటుంబంలో మిగిలినవారు చెప్పడం తప్ప ఏరోజు ప్రభాస్ వీటిని పట్టించుకోలేదని వేణుస్వామి స్వయంగా చెప్పుకొచ్చాడు. కష్టాన్ని నమ్ముకోవడమే కానీ, జాతకాల మీద ఆధారపడేవాడు కాదు డార్లింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి యోగం లేదన్న వేణుస్వామి మాటలను మళ్లీ బ్రేక్ చేస్తూ.. వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి కబురు చెప్తాడేమో చూడాలి.
Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..