Venu Swami Senstaional Comments on JR NTR Astrology goes Viral: సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా జూ.ఎన్టీఆర్ జాతకాన్ని తాజాగా తెర మీదకు తీసుకువచ్చారు. జూ.ఎన్టీఆర్ కి రాజయోగం ఉంది అని పలు సందర్భాల్లో తెలిపిన వేణు స్వామి ఇప్పుడు మాట్లాడిన మాటలు అయితే ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టే విధంగా ఉన్నాయి. కంగారు పెట్టేశాడు. ఆయన చెబుతున్న ఒక విషయం భయపెట్టే విధంగానే ఉంది. వేణు స్వామి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సన్నిధిలో తాను, ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ గారు షాలిని కూర్చుని మాట్లాడుకున్నామని అప్పటికే ఎన్టీఆర్ జాతకాన్ని నేను చాలా సార్లు చెప్పానని అయితే అప్పుడు ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగారని అన్నారు. తారక్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందని, ఆ దోషం తెలియకుండానే తారక్ జాతకం అంత కరెక్ట్ గా ఎలా చెబుతున్నారు అని ఆమె ప్రశ్నించింది.
PVR INOX: సౌత్ లో రచ్చ రేపే ఆఫర్ తో దిగుతున్న పీవీఆర్.. వింటే సినిమాలకి వెళ్లకుండా ఆగలేరు!
అప్పుడు తాను తనకు ఆ సమస్య ఏంటో నాకు తెలుసు తల్లి అని తారక్ కి ఉన్న పుట్టుక దోషం ఏమిటో చెప్పానని దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారని అన్నాడు. ఎందుకంటే ఆమె ఆ దోషం గురించి నాకు, తారక్ కి, పెద్ద ఎన్టీఆర్ కి మాత్రమే తెలుసు మరో నాలుగో వ్యక్తికి తెలియదు కదా, అలాంటిది మీకు ఎలా తెలుసు అని ఆమె ఆశ్చర్యపోగా నాకు అన్ని విషయాలు తెలుసు అమ్మా అని చెప్పానని చెప్పుకొచ్చాడు. అయితే ఇంత చెప్పాడు కానీ అసలు ఆ సమస్య ఏంటనే విషయం మాత్రం వేణు స్వామి బయట పెట్టలేదు.ఇక జూ. ఎన్టీఆర్ ది మకా నక్షత్రం అని మాజీ సీఎం, నటి జయలలిత గారిది కూడా అదే నక్షత్రం అని పేర్కొన్న వేణు స్వామి తారక్ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని, 2030 వరకు తారక్ ని రాజకీయాల్లోకి రానివ్వకండి అని వాళ్ళ అమ్మగారికి చెప్పినట్లు వెల్లడించారు. ఇక అసలు ఆయనకి ఉన్న ఆ దోషం ఏంటి ? ఎందుకు తండ్రి హరికృష్ణకు కూడా తెలియకుండా అంత రహస్యంగా ఎందుకు ఉంచారు అనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ పుట్టుకకి ఉన్న దోషం కారణంగా ఏం జరగబోతోంది అనేది మాత్రం వేణు స్వామి ప్రస్తావించకపోవడం గమనార్హం. .