యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కార్తికేయకి హీరోయిన్ గా నేహ శెట్టి నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా బెదురులంక 2012 సినిమా తెరకెక్కుతుంది అనే విషయం టీజర్ తో అర్ధం అయ్యేలా క్లియర్ కట్ చూపించారు చిత్ర యూనిట్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, యుగాంతం కాన్సెప్ట్ ని తీసుకోని క్లాక్స్ ప్లే చేసిన గేమ్ ఎలా ఉండబోతుందో టీజర్ తో సాంపిల్ చూపించాడు.
Read Also: Kabzaa: ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా మావా… ‘రోలెక్స్’ రేంజులో రివీల్ చేశావ్
లేటెస్ట్ గా బెడురులంక 2012 మూవీ నుంచి సాంగ్ ని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. నేహ శెట్టి, కార్తికేయ, క్లాక్స్, మ్యూజిక్ డైరెక్టర్ బెన్నీ కలిసి ఒక ఫన్నీ వీడియోని చేశారు. ఈ వీడియోని రిలీజ్ చేసి ఫస్ట్ సాంగ్ “వెన్నెల్లో ఆడపిల్ల”ని మార్చ్ 7న ఉదయం 10:40కి విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ, ఈ “వెన్నెల్లో ఆడపిల్ల” పాటని కూడా అదే స్టైల్ లో కంపోజ్ చేసాడట. సినిమా కొత్తగా ఉంటే సరిపోదు, ప్రతిదీ కొత్తగానే ఉండాలి అని ప్రమోషనల్ కంటెంట్ ని ఫ్రెష్ ఫీల్ తో రిలీజ్ చేస్తున్నారు బెదురులంక 2012 మేకర్స్. మరి ఈ మూవీ కార్తికేయకి అవసరమైన హిట్ ని ఇస్తుందేమో చూడాలి.
పాట వెనక మాటల్లో మా పాట్లు ఎలా ఉంటాయంటే…https://t.co/bmUPoPirkW#VennelloAadapilla Song on MAR 7th, 10:40AM💕 #Bedurulanka2012 @iamnehashetty #Clax #Manisharma @KittuVissaprgda @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth @PulagamOfficial pic.twitter.com/rfAJpgta6r
— Kartikeya (@ActorKartikeya) March 2, 2023
