Site icon NTV Telugu

Vennela Kishore : ఆ మూవీ కోసం సర్జరీ చేసుకోమన్నారు.. వెన్నెల కిషోర్ కామెంట్స్..

Vennela Kisore

Vennela Kisore

Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన సింగిల్ మూవీలో నటించి మంచి హిట్ అందుకున్నాడు. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఆయన నటించి మెప్పించాడు. ఈ మూవీలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్లు చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. కెరీర్ లో నేను ఎన్నో సినిమాల్లో నటించాను. ఇది నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను మొదట్లో కమెడియన్ గా చేస్తానో లేదో అనుకునేవాడిని. ప్రతి క్యారెక్టర్ ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. కానీ డ్రీమ్ రోల్ మాత్రం దూకుడు సినిమాలోనిదే. ఆ మూవీలో మహేశ్ బాబు పక్కన అంత మంచి పాత్ర రావడంతోనే నా కల తీరిపోయింది.

Read Also :Raghunandan Rao: దేశద్రోహులకు, కాంగ్రెస్‌కు ఉన్న సంబంధం బయటపడింది..

ఆ మూవీ కోసం శ్రీను వైట్ల గారు నాకు కథ చెప్పారు. కానీ అప్పుడు నేను లావుగా ఉన్నా. పోలీస్ ఆఫీసర్ పాత్ర కాబ్టటి స్లిమ్ గా కనిపించాలన్నారు. అవసరం అయితే సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు. కానీ నేను సర్జరీ జోలికి పోలేదు. కసరత్తులు చేసినా అనుకున్నంత మాత్రం సన్నబడలేదు అలాగే నటించా. పాత్రకు అదే ప్లస్ అయింది. మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి నేను నటనను మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నాను. కొన్ని సార్లు పాత్ర కోసం ఫిజిక్ ను మెయింటేన్ చేయాలని చెబుతున్నా.. అది నా బాడీకి సెట్ కావట్లేదు. అయినా నన్ను డైరెక్టర్లు భరిస్తున్నారు’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

Read Also : Operation Sindoor: భారత్‌కు నష్టమేమీ జరగలేదు.. ఏకే భారతి వెల్లడి

Exit mobile version