Site icon NTV Telugu

What the Fish: క్రేజీగా వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్.. వాట్ ది ఫిష్ మాస్టారూ?

What The Fish Vennela Kishore

What The Fish Vennela Kishore

Vennela Kishore Look From What the Fish Released: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సినిమాలకి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎట్టకేలకు అయన మంచి కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఒకరకంగా క్రేజీ ప్రాజెక్ట్ గా భావిస్తున్న ‘వాట్ ది ఫిష్’ తో కమ్ బ్యాక్ ఇవ్వనున్నారు. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథ , స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. ‘వాట్ ది ఫిష్’ ‘మనం మనం బరంపురం’ అనే సినిమా ట్యాగ్ లైన్ తో హై ప్రొడక్షన్ వాల్యూస్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. పాన్-ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 6ix సినిమాస్‌ బ్యానర్ల మీద విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మనోజ్ ని విభిన్న గెటప్‌లలో ప్రజెంట్ చేస్తూ ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

Mansion 24: దెయ్యాలు ఉన్నాయంటే నమ్మను కానీ ‘మాన్షన్ 24’ చూస్తే భయమేసింది: సత్యరాజ్

ఫస్ట్ లుక్ పోస్టర్ లో సీరియస్ లుక్ లో చేతిలో ఓ పెద్ద రంపం మెషెన్ తో చాలా క్రేజీగా కనిపిస్తున్నారు. బ్యాగ్ గ్రౌండ్ లో కరెన్సీ నోట్లు గాల్లో ఎగరడం సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేస్తోంది. ఇక ఈ పోస్టర్ చూస్తేనే ఈ సినిమాలో వెన్నెల కిశోర్ పాత్ర చాలా క్రేజీ గా ఉంటుందని అర్ధమౌతుంది. ఈ సినిమా అడ్వెంచరస్ షూటింగ్ టొరంటో నగరం, కెనడాలోని వివిధ ప్రదేశాలలో జరిగిందని ఇనిమ కోసం ప్రతిభావంతులైన నటీనటులు, టెక్నికల్ టీం పని చేస్తుందని అధికారిక ప్రకటన విడుదల చేసింది యూనిట్. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వివిధ భాషల్లో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మనోజ్ మంచు, వెన్నెల కిశోర్ మినహా ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు సినిమా యూనిట్ రివీల్ చేయలేదు.

Exit mobile version