Venky Re Release: నిప్పు నాగరాజు గారు.. వెంకీ గ్యాంగ్ వస్తుంది.. టికెట్స్ చూడాలి మరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venky Re Release: ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ల హడావిడి కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. కొత్తలో అయితే .. మా హీరో ఓల్డ్ సినిమా వస్తుంది అని ఫ్యాన్స్ హడావిడి చేయడం, థియేటర్ ను తగలబెట్టడం కూడా చూసాం. ఇక ఖుషి సినిమా రీ రిలీజ్ కు అయితే నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ అని చెప్పాలి. పవన్ ఫ్యాన్స్ ఆ సినిమాను అప్పుడు బ్లాక్ బస్టర్ చేశారు. ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్ చేశారు. అయితే రీరిలీజ్ లు కొన్ని మాత్రమే హిట్ అందుకున్నాయి. ఇంకొన్ని పరాజయాన్ని చవిచూశాయి. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ్ హిట్ సినిమాలు చాలానే రీ రిలీజ్ అయ్యాయి. కానీ, ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సినిమాకు మాత్రం పెద్ద చరిత్రే ఉంది. సోషల్ మీడియాలో మీమ్ పేజిస్ కొన్ని నడుస్తున్నాయి అంటే.. అది ఈ సినిమా వలెనే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చూసిన సినిమా ఎన్నిసార్లు చూస్తారు అని విసుకున్నవాళ్ళే.. ఈ సినిమా వస్తుంది అంటే.. టీవీ ముందు అతుక్కుపోతారు.
ఏ అసలు ఆ సినిమా ఏంటి అనేగా అడగబోతున్నారు. ఇంకేం సినిమా.. అదే వెంకీ. మాస్ మహారాజా రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ వెంకీ. అందులో రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణు మాధవ్ కామెడీ వేరే లెవెల్ అని చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ రవితేజ కెరీర్ బెస్ట్ సినిమాల లిస్ట్ తీస్తే.. టాప్ 5 లో వెంకీ కచ్చితంగా ఉంటుంది. అలాంటి ఈ సినిమా డిసెంబర్ 30 న రీ రిలీజ్ కానుంది. మరి ఇలాంటి రికార్డ్ బద్దలుకొట్టిన సినిమా రీరిలీజ్ అవుతుంటే రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా హడావిడి మొదలుపెట్టేసారు. నిప్పు నాగరాజు.. వెంకీ, గజలా.. అరేయ్ బొక్కా అంటూ కొందరు.. అందాల చక్కెరకేళి అని సాంగ్స్ పాడుతూ మరికొందరు టికెట్స్ తీసేసుకుంటున్నారు. కొత్త సినిమాకు హౌస్ ఫుల్ అయినట్లు వెంకీ రీరిలీజ్ కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి. అది మరి.. మాస్ మహారాజా రవితేజ అంటే అని ఫ్యాన్స్ కలర్ ఎగురవేస్తున్నారు. మరి ఆ రోజు రచ్చ ఎలా ఉంటుందో చూడాలంటే మరో నాలుగు రోజులు ఓపిక పట్టాల్సిందే.
Also Read
- Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
తాజావార్తలు
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!