Site icon NTV Telugu

Venkatesh: హిట్ యూనివర్స్ లో మొన్న బాలయ్య.. నేడు వెంకీమామ

Venky

Venky

Venkatesh:మంచి సినిమాను ఆదరించాలనంటే తెలుగు ప్రేక్షకులు.. మంచి కథను సపోర్ట్ చేయాలంటే తెలుగు హీరోల తరువాతే ఎవరైనా.. సినిమా బావుంది అని టాక్ రావడం ఆలస్యం హీరోలు సైతం సినిమాను చూసి తమ రివ్యూలు చెప్పేస్తూ ఉంటారు. ప్రస్తుతం వెంకీ మామ కూడా అదే పనిలో ఉన్నాడు. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిట్ 2. నాని నిర్మించిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొంది. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా సినిమాకు మంచి సపోర్ట్ ను అందిస్తున్నారు. మొన్నటికి మొన్న బాలకృష్ణ, తన వారసుడు మోక్షజ్ఞతో హిట్ 2 సినిమా చూసి చిత్ర బృందాన్ని అభినందించిన విషయం తెల్సిందే.

ఇక తాజాగా విక్టరీ వెంకటేష్ హిట్ 2 సినిమాను వీక్షించారు. సినిమా చాలా బావుందని, చిత్ర బృందం సినిమా కోసం చాలా బాగా కష్టపడిందని చెప్పుకొచ్చాడు. అందుకు శైలేష్ కొలను.. డీసీపీ రామచంద్రన్ మెచ్చుకోవడం కన్నా పెద్ద ప్రశంస ఏముంటుందని చెప్పుకొస్తూ థాంక్స్ చెప్పాడు. ఇక ఈ వీడియోను అడివి శేష్ ట్వీట్ చేస్తూ వెంకీ మామకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ముందు హిట్ యూనివర్స్ లో ఈ సీనియర్ హీరోలు ఏమైనా చేరుతారేమో చూడాలి.

Exit mobile version